సోదర బంధానికి కళంకం తెచ్చాడు. తన తోడబుట్టిన చెల్లెమ్మపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లండన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్ నగరంలో నాలుగేళ్ల చిన్నారిపై ఆమె 13 ఏళ్ల సోదరుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆ బాలుడికి 13 ఏళ్లు. ఏడాది పాటు తన సోదరిపై ఈ అకృత్యాన్ని కొనసాగిస్తున్నాడు.
ఈ విచారణ సందర్భంగా బాలుడు ఫోనులో అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు వున్నట్లు తెలియవచ్చింది. దీంతో బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి.. అతనిపై ఓ కన్నేసి వుంచాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆ బాలుడితో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అనే కోణంలో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల నివేదిక ఆధారంగా బాలుడికి జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెప్తున్నారు.