మొసలితో శృంగారం చేస్తా... దుస్తులిప్పేసి వాటేసుకున్నాడు... ఏం జరిగింది?

బుధవారం, 21 జూన్ 2017 (20:36 IST)
కామ కోర్కెలను రేపే కొన్ని మాదక ద్రవ్యాలను సేవించి ఓ యువకుడు నిలువునా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వివరాలను చూస్తే... తన స్నేహితులతో కలిసి 26 ఏళ్ల యువకుడు బీచ్ లోని రిసార్ట్ వద్ద పార్టీ చేసుకున్నాడు. ఆ క్రమంలో తీవ్ర శృంగార వాంఛను రగిలించే ఓ రకమైన మాదక ద్రవ్యాన్ని పీల్చాడు. 
 
ఆ తర్వాత అతడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనకిప్పటికిప్పుడే సముద్రంలోని మొసలితో శృంగారం చేయాలని కోర్కెగా వుందంటూ తన స్నేహితులతో చెప్పాడు. దాంతో షాక్ తిన్న స్నేహితులు అతడిని వారించే ప్రయత్నం చేశారు. కానీ అతడు ఏమాత్రం పట్టించుకోకుండా బీచ్ వైపు పరుగులు తీశాడు. 
 
మొసలి కోసం వెతికాడు. అంతలో అతడికి మొసలి కనబడింది. వెంటనే దాని వద్దకెళ్లి దుస్తులన్నీ విప్పేసి దాన్ని వాటేసుకున్నాడు. అంతే... క్షణాల్లో ఆ మొసలి అతడిని నీటిలోకి ఈడ్చుకెళ్లింది. అలా అతడు తన ప్రాణాలను కోల్పోయాడు.

వెబ్దునియా పై చదవండి