ఓ ఎన్నారై బాలిక తన అసాధారణ ప్రతిభతో ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా గుర్తింపు పొందింది. ఈ బాలిక తన తెలివి తేటలతో అమెరికా అగ్ర యూనివర్శిటీని మెప్పించి శభాష్ అనిపించుకుంది. ఆ బాలిక పేరు ప్రజ్ఞ. ప్రపంచంలోనే అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఎంపికైంది.
న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్‌మియర్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నటాషా పెరి(11) అనే విద్యార్థిని ఈ ఘనత సాధించింది. అమెరికాలోని కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించడానికి స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(ఎస్‌ఏటీ), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్(ఏసీటీ) అనే పరీక్షలు నిర్వహిస్తుంటారు.