తను నన్ను ఇష్టపడటం నా అదృష్టం: తమన్నా

గురువారం, 7 జులై 2011 (13:52 IST)
టాలీవుడ్‌లో ఈరోజున హండ్రెడ్‌ పర్సెంట్‌ క్రేజ్‌ కలిగిన హీరోయిన్లలో 'తమన్నా' ఒకరు. తమన్నా కాల్షీట్స్‌ తీసుకోగలిగితే, టాప్‌ హీరోల కాల్షీట్స్‌ సంపాదించుకోవడం చాలా సులువైపోతుందనేంతగా తమన్నా హవా నడుస్తోంది. 'హ్యాపీడేస్‌'తో క్లాస్‌ ఆడియన్స్‌ను తన కొంగుకు కట్టేసుకున్న తమన్నా... ఆ తర్వాత 'వీడొక్కడే', 'ఆవారా' వంటి తమిళ అనువాద చిత్రాలతో మాస్‌ ఆడియన్స్‌నూ తన సొగసుల బుట్టలో వేసేసుకుంది.

ఇక '100% లవ్‌', 'బద్రినాథ్‌', చిత్రాలలో తమన్నా అందాలు సృష్టిస్తున్న అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో డామినేట్‌ చేయబడే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల డామినేషన్‌తో పోటీ పడేంత క్రేజ్‌ సంతరించుకున్న హీరోయిన్లు తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి నేటివరకూ కేవలం వేళ్ళతో లెక్కించగలిగే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేటితరం హీరోయిన్లలో ఆ ఘనతను సొంతం చేసుకున్న హీరోయిన్‌గా తమన్నాను చెప్పుకోవచ్చు. తమన్నా కోసం, తమన్నా అందాల కోసం థియేటర్ల ముందు బారులు తీరే ప్రేక్షకాభిమానులు నేడు లక్షల్లో ఉన్నారు.

 
WD
మీ కుటుంబ నేపథ్యం..?
మాది సింధీ కుటుంబం. అమ్మ పేరు రజని. నాన్న పేరు సంతోష్‌. నాకు ఒక అన్నయ్య ఉన్నారు. పేరు ఆనంద్‌. తను ప్రస్తుతం మెడిసిన్‌ చదువుతున్నారు. ముంబై మా స్వస్థలం.

 
WD
మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
నాకు చిన్నప్పట్నుంచి హీరోయిన్‌ కావాలనే ఉండేది. అదృష్టవశాత్తు నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ డిస్కరేజ్‌ చేయలేదు. దాంతో నా 13వ ఏటే నేను సినీరంగ ప్రవేశం చేశాను. 'చాంద్‌సా రోషన్‌ బెహ్రా' అనే హిందీ చిత్రమది. ప్రస్తుతానికి అదే చివరి హిందీ చిత్రం కూడా. ఎందుకంటే ఆ చిత్రం తర్వాత నేను మళ్ళీ హిందీ సినిమా చేయలేదు. 'శ్రీ' చిత్రంతో తెలుగులో ఆఫర్‌ రావడం, ఆ తర్వాత నా కెరీర్‌లో 'హ్యాపీడేస్‌' మొదలు కావడం మీకు తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి నా కెరీర్‌ గురించి నాకంటే మీకే బాగా తెలుసు (పెద్దగా నవ్వుతూ).

WD

WD
సినిమాల్లో నటించడానికి ముందు శిక్షణ ఏమైనా తీసుకున్నారా?
అవును. చెప్పడం మరిచా. నటనపై నాకు గల ఆసక్తిని గమనించి నా పేరెంట్స్‌ నా పదో ఏటే నన్ను థియేటర్‌ ఆర్ట్స్‌లో చేర్పించారు. అలాగే డాన్సంటే నాకు చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. అందుకే డాన్స్‌కు సంబంధించి ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాను.

WD
అమ్మా-నాన్న... ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం?
అలా చెప్పలేను. నాకు వాళ్ళిద్దరూ రెండు కళ్ళవంటివారు. మీ రెండు కళ్ళల్లో మీకు ఏ కన్ను అంటే ఇష్టమో అంటే ఏం చెప్పగలం చెప్పండి? కాకపోతే మా నాన్నతో నేను అన్ని విషయాలూ డిస్కస్‌ చేస్తుంటాను. ఆయన కూడా ఓపికగా నేను చెప్పేదంతా విని, వ్యక్తిగతంగా కెరీర్‌పరంగా నాకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

WD
మరి మీ అన్నయ్య..?
నేనెలాగూ ఉన్నత చదువులు చదువుకోలేదు కదా. అందుకని అన్నయ్యను ఎక్కువగా డిస్ట్రబ్‌ చేయను. అయితే మా అన్నయ్యకి నేనంటే ఎంతో ఇష్టం. తను చదువుతున్నది మెడిసిన్‌ కాబట్టి చాలా టైమ్‌ దానికి కేటాయించాల్సి వస్తుంది.

WD
తమిళంలో నంబర్‌వన్‌ హీరోయిన్‌గా ఉన్న మీరు తెలుగులోనూ ఆ స్థానంపై గురి పెట్టారని అందరూ అనుకుంటున్నారు కదా?
నిజం చెబుతున్నాను. నెంబర్‌ వన్‌, నంబర్‌ టు స్థానాలపై నాకు నమ్మకం లేదు. పైగా నా కెరీర్‌ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే నెంబర్‌వన్‌ అయిపోయానని నేను అనేసుకుంటే ఇక ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాను? నా పని నేను సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగడమే నా కర్తవ్యంగా నేను భావిస్తుంటాను. చేసిన ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకోవడం, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడడం మాత్రం చేస్తుంటాను.

WD

WD
మీకు కాంపిటీషన్‌ ఎవరని మీరు అనుకుంటున్నారు?
ఏదైనా ఒక సినిమాలో హీరోయిన్‌ని తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచిస్తాను. ఎందరి అభిప్రాయాలో తీసుకుంటాను. హీరోయిన్‌కు ఇచ్చే రెమ్యునరేషన్‌ పక్కనపెడితే సినిమా నిర్మాణం అన్నది కోట్లాది రూపాయలతో కూడుకున్నది. కాబట్టి ఎవరినిబడితే వారిని హీరోయిన్స్‌గా తీసుకోరు.

కాబట్టి హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ చాలా మంచి క్వాలిటీస్‌ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే కొందరికి లక్‌ కలిసొస్తుంది. కొందరికి కలిసిరాదు. నా కెరీర్‌ బిగినింగ్‌లో నాకు 'హ్యాపీడేస్‌' సినిమా వచ్చి ఉండకపోతే నా కెరీర్‌ ఎలా ఉండేదో ఎవరైనా ఊహించగలరా? అందువల్ల ఫలానా హీరోయిన్‌ నాకు కాంపిటీషన్‌ అని, ఫలానా హీరోయిన్‌ నాకు పోటీ కాదని నేనెలా చెప్పగలను.

WD
మీరంటే తనకు చాలా ఇష్టమని అనుష్క తరచూ చెబుతుంటుంది కదా?
నాకు కూడా అనుష్క అంటే చాలా ఇష్టం. ఆ మాటకొస్తే అనుష్కను ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆమె సిన్సియారిటీ, డిసిప్లిన్‌, కెరీర్‌ పట్ల ఆమెకుండే డెడికేషన్‌ నుంచి నేను చాలా స్ఫూర్తి పొందుతుంటాను. నన్ను తను ఇష్టపడడం నా అదృష్టంగా నేను భావిస్తాను.

WD
తెలుగులో మీరు చేస్తున్న సినిమాలు?
ఎన్టీఆర్‌తో 'ఊసరవెల్లి' చేస్తున్నాను. చరణ్‌తో 'రచ్చ' చేస్తున్నాను.

WD
తెలుగు, తమిళం రెండిట్లో మీ ప్రాధాన్యం దేనికి?
దీనికి అని పర్టిక్యులర్‌గా చెప్పలేను. కాకపోతే తమిళ్‌ కంటే తెలుగు సినిమా చేయడం సౌకర్యంగా ఫీలవుతాను.

WD
మీ మీద వచ్చే పుకార్ల గురించి మీరు ఎలా స్పందిస్తారు?
అసలు పట్టించుకోను. మనం పట్టించుకునే కొద్దీ పుకార్లకు ప్రాధాన్యత పెరిగిపోతుంది. పట్టించుకోకపోతే అవే కొన్ని రోజులు షికారుచేసి ఆ తర్వాత చతికిలపడతాయి.

వెబ్దునియా పై చదవండి