700 మంది ఉద్యోగులను పీకేయనున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్

శనివారం, 21 జనవరి 2017 (17:54 IST)
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కఠిన నిర్ణయం తీసుకోనుంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో 700 మందికి కోత విధించనుంది. వచ్చే వారంలో ప్రకటించబోయే ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఉద్యోగాల కోతను మైక్రోసాప్ట్ ప్రకటిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2017 జూన్ వరకు 2,850 ఉద్యోగాలకు కోత విధించబోతున్నామని మైక్రోసాప్ట్ ఇంతకమునుపే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఈ నెలలో 700 మందికి కంపెనీ గుడ్ బై చెప్పనుందట.
 
2016 జూన్ 30 వరకు మైక్రోసాప్ట్‌లో 1,14,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను జనవరి 26న గురువారం ప్రకటించనుంది. థామ్సన్ రాయిటర్స్ అంచనాల ప్రకారం కంపెనీ 25.27 బిలియన్ డాలర్ల రెవెన్యూ ఆర్జిస్తుందని తెలుస్తోంది. 2013లో నోకియాను సొంతంచేసుకున్న అనంతరం స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లో పనిచేస్తున్న 25 వేలకు పైగా ఉద్యోగులను మైక్రోసాప్ట్ పీకేసిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి