వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... మెసేజ్‌ల ఉపసంహరణ 'రీకాల్' ఆప్షన్

గురువారం, 8 జూన్ 2017 (14:04 IST)
సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున, లేదా తొందరపడి పంపిన వాట్సప్ మెసేజ్‌లను ఉపసంహరించకునేలా ఈ ఆప్షన్ పని చేయనుంది. దీనికి ‘రీకాల్’ అనే పేరు పెట్టారు. 
 
వాట్సప్ అందించే ఈ సదుపాయంలో వినియోగదారులు తాము పంపిన వాట్సప్ మెసేజ్‌ను ఐదు నిముషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు. పంపిన మెసేజ్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు, వేరే నెంబర్‌కు మెసేజ్ పంపించి ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఈ రీకాల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వాట్సప్ సంస్థ తెలిపింది. 
 
వాట్సప్ బీటా వెర్షన్‌లో పంపిన మెసేజ్‌లను వినియోగదారులు ఐదు నిముషాల్లోగా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి వినియోగదారుడు తాను తాజాగా పంపిన మెసేజ్‌ను మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గతంలో పంపిన మెసేజ్‌లన్నీ ఉపసంహరించుకునేందుకు వీలు లేదు. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో వాట్సప్ తన సేవలు అందిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి