దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సంచలన ఆఫర్లు ప్రకటిస్తున్న రిలయన్స్ జియో తాజాగా.. మరో ఆఫర్‌ను ప్రకటించింది. ట్రాయ్ ఆదేశాలతో జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను రద్దు చేసిన జియో.. తాజాగా దానికి ధీటుగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349తో రీచార్జ్ చేస్తే 84 రోజులపాటు రోజుకి 1జీబీ డేటా చొప్పున వాడుకునే సౌలభ్యాన్ని కల్పించింది.
అదే రూ.509తో రీఛార్జ్ చేస్తే రోజుకి 2జీబీ డేటాను చొప్పున 84 రోజుల పాటు ఈ ఆఫర్‌ని వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్స్ జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద మూడునెలల పాటు అపరిమిత కాల్స్, డేటా ఉపయోగించుకోవచ్చు.
ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోని కస్టమర్లకు కొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. రూ.408తో రీఛార్జ్ చేస్తే రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. ఒకవేళ రోజుకి 2జీబీ డేటా కావాలనుకుంటే రూ.608తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్స్ కాలపరిమితి 84రోజులు. ఈ తాజా ఆఫర్‌తో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోయాయి. సమ్మర్ సర్‌ప్రైజ్ పేరుతో తీసుకొచ్చిన ఆఫర్‌ను ట్రాయ్ నియంత్రించడంతోనే జియో ఇప్పుడు సడన్‌గా సరికొత్త 'ధన్ ధనా ధన్' ఆఫర్ ప్రకటించింది.