ఇకపోతే.. జియో మొబైల్ వినియోగదారుల సంఖ్య పది కోట్లకు చేరిందని తెలిపారు. గత 170 రోజులుగా సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో యూజర్లుగా మారారని చెప్పారు. జియో నెట్‌వర్క్‌లో ప్రతి రోజూ 5.5 కోట్ల గంటల వీడియోను చూస్తున్నారని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని 99 శాతం జనాభాను జియో కవర్ చేస్తుందని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు
కేవలం జనవరి నెలలోనే జియో కస్టమర్లు 100 కోట్ల జీబీ డేటా వినిగించుకున్నట్టు వెల్లడించారు. మొబైల్ డాటా వినియోగంలో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇకపోతే... ఏప్రిల్ 1 నుంచి జియో కస్టమర్ల నుంచి చార్జీల వసూలు ప్రారంభిస్తామన్నారు. డేటా అన్నది డిజిటల్ లైఫ్‌కి ఆక్సిజన్ లాంటిదని పునరుద్ఘాటించారు.