మనం చూస్తున్న టీవీలో ముఖ్యాంశాలు ఎప్పుడైనా కింది నుండి పైకి గానీ, పై నుండి కిందికి గానీ రావడం గమనించారా? అంతేకాదు ముఖ్యాంశాలు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్తున్నట్లు ఎందుకు కనిపిస్తాయో ఆలోచించారా? లేదా మీరు దీనిలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? అలా ఎందుకు జరుగుతుందో ఒక చిన్న కారణాన్ని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అదేమిటో చూద్దామా..
మనం టీవీ చూసేంత సేపు ముఖ్యాంశాలు ఎప్పుడూ కుడి నుండి ఎడమవైపుకు స్క్రోల్ అవుతుంటాయి. కాగా పై నుండి కిందికి స్క్రోల్ కావు (కొన్ని గేమ్ షోలలో జరగవచ్చు), అలా జరగడానికి కారణం మన 'కళ్లు'. మన కళ్లకీ., అలా జరగడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండీ..మన కళ్లు కుడి నుండి ఎడమవైపుకు, లేదా ఎడమవైపు నుండి కుడివైపునకు మాత్రమే తిప్పగలము.