"దబ్బకాయ పులిహార" రుచి చూస్తారా..?

FILE
కావలసిన పదార్థాలు :
దబ్బకాయ రసం.. ఒక కాయది
బియ్యం.. అర కేజీ
కరివేపాకు, తాలింపు గింజలు.. సరిపడా
పసుపు.. కాస్తంత
వేరుశెనగపప్పులు.. అర కప్పు
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
అన్నం వండుకుని కొద్దిగా చల్లారిన తర్వాత దబ్బకాయ రసం, పసుపులను దాంట్లో కలపాలి. అందులోనే ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తాలింపు పెట్టి, అందులో వేరుశెనగ గింజలు కూడా వేసి వేయించి.. దబ్బకాయ రసం కలుపుకున్న అన్నాన్ని అందులో వేసి కలియబెడితే దబ్బకాయ పులిహోర సిద్ధమైనట్లే..!

దబ్బకాయ రసం బదులు నిమ్మరసం లేదా మామిడికాయ తురుము కూడా వాడుకోవచ్చు. కొంతమంది బియ్యం, శనగపప్పు రెండింటిని కలిపి ఉడకబెట్టి దానిని నేరుగా తాలింపు వేసి.. చివర్లో నిమ్మరసం లేదా దబ్బరసం పిండుతుంటారు కూడా..! ఎవరికి ఇష్టమైనట్లే వారు దీనిని తయారు చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి