బటర్ నాన్ ఎలా చేయాలో మీకు తెలుసా?

ప్రోటీన్లు, కెలోరీలు మస్తుగా ఉన్న బటర్ నాన్‌ను ఎప్పుడూ హోటల్లో తిని తిని బోర్ కొట్టిందా.. ఇంట్లోనే ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా.. అయితే ఇదిగోండి రిసిపీ ట్రై చేసి చూడండి..

బటర్ నాన్
కావలసిన పదార్థాలు :
మైదాపిండి - నాలుగు కప్పులు
పాలు - ఒక కప్పు
పెరుగు - ఒక కప్పు
ఈస్ట్ - మూడు టీ స్పూన్లు
పంచదార - రెండు టీ స్పూన్లు
బటర్, ఉప్పు, నూనె - తగినంత


తయారీ విధానం :
ముందుగా పాలు గోరువెచ్చగా వేడి చేసి అందులో ఈస్ట్, పంచదార చేర్చి బాగా కలిపి మూతపెట్టాలి. పాలు తెల్లాక పెరుగును చేర్చి కలిపి మళ్లీ పొంగువచ్చేంతవరకు ఉంచాలి. ఇందులో ఈస్ట్, మైదాను చేర్చి దించాలి. దీంతో ఉప్పు, బటర్ చేర్చి బాగా మృదువుగా రోటీలకు తగ్గట్టు కలుపుకోవాలి.

15 నిమిషాల తర్వాత పిండిని రోటీల్లా రుద్దుకుని.. దోసె కడాయి వేడయ్యాక, నీళ్లు చల్లి ఇరువైపులా దోరగా వేపుకుని బటర్ చికెన్, కడాయి చికెన్‌, పనీర్ బటర్ మసాలాతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

వెబ్దునియా పై చదవండి