ఆదివారం బిర్యానీకి.. పొటాటో రైతా అయితే?

శనివారం, 1 ఫిబ్రవరి 2014 (14:43 IST)
FILE
ఆదివారం బిర్యానీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఒకేలా ఆనియన్ రైతా కాకుండా డిఫరెంట్‌గా పొటాటో రైతా ట్రై చేయండి. ఎన్నో పోషకాలతో కూడిన పొటాటోతో రైతా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా పిల్లలు ఈ రైతా తెగ నచ్చేస్తుందని కుకరీ ఎక్స్‌పోర్ట్స్ అంటున్నారు. మరి పొటాటో రైతా ఎలా చేయాలో ట్రై చేద్దామా?

ఉడికించిన బంగాళాదుంప తురుము - ఒక కప్పు
పచ్చి మిర్చి, ఆనియన్ - చెరో అర కప్పు
కొబ్బరి తురుము - అరకప్పు
పెరుగు- రెండు కప్పులు
ఆవాలు, కరివేపాకు - తాలింపుకు తగినంత
నూనె - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత,
కొత్తిమీర తురుము - కాసింత

తయారీ విధానం :
బాణలి వేడయ్యాక నూనె, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన పొటాటో తురుముతో చేర్చుకోవాలి. తర్వాత పెరుగు, ఉప్పు, కొబ్బరి తురుము కలిపి కొత్తిమీర గార్నిష్‌తో హాట్ హాట్ బిర్యానీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

వెబ్దునియా పై చదవండి