పండుమిరపతో చింతకాయ తొక్కు ఎలా చేస్తారు?

సోమవారం, 25 నవంబరు 2013 (16:57 IST)
File
FILE
కావలసిన పదార్థాలు:
చింతకాయలు : ఒక కిలో
పండుమిర్చి : ఒక కిలో
ఉల్లిపాయలు : పావు కేజీ
మెంతులు : 100 గ్రాములు
జీలకర్ర : 50 గ్రాములు
ఉప్పు (ఉప్పుకల్లు) : 375 గ్రాములు
పసుపు : 10 గ్రాములు

తయారీ విధానం ఎలా?
ముందుగా బాగా కండ ఉన్న చింతకాయలు తీసుకుని తొక్కలు తీసి కొద్దికొద్దిగా అందులో ఉప్పు, పసుపు వేయాలి. తర్వాత రోటిలో బాగా దంచి, అందులోని గింజలు తీసి వేయాలి. ఆ గింజల్లో కొద్దిగా నీళ్ళు పోసి, మరోసారి దంచి గింజలు పూర్తిగా తీసివేయాలి. పండుమిర్చిలో కొంచెం ఉప్పు, ఉల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీలో వేయాలి.

అవి కచ్చాపచ్చాగా అయ్యాక చింతకాయ గుజ్జు కూడా వేసి కలిపి అందులో వేయించి పొడి చేసిన జీలకర్ర, మెంతుల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో కంటే రోటిలో రుబ్బుకుంటే తొక్కు మరింత రుచిగా ఉంటుంది. ఇందులో పోపు అవసరమనుకుంటే నువ్వుల నూనెలో తాళింపు గింజలు, వక్కలుముక్కలుగా దంచిన ఎల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పెట్టుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి