కాశ్మీరీ మటన్ ఘోస్ట్‌ను ఎలా తయారు చేస్తారు?

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (16:44 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని పొట్టేలు లేదా మేకపోతు మాంసం... అరకేజీ
పెరుగు... ఒక కప్పు
యాలక్కాయలపొడి... ఒక టీ.
జాపత్రి... తగినంత
దాల్చిన చెక్క... చిన్న సైజువి రెండు
జీడిపప్పు... వంద గ్రా. (పేస్టు చేయాలి)
అల్లం వెల్లుల్లి ముద్ద... ఐదు టీ.
నూనె... సరిపడా
మీగడ... ఐదు టీ.

తయారీ విధానం :
పొట్టేలు లేదా మేకపోతు మాంసాన్ని శుభ్రంగా కడిగి, జీడిపప్పు ముద్ద, పెరుగు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత యాలక్కాయల పొడి, జాపత్రి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.

కాసేపలా వేగిన తర్వాత మీగడ, ఉడికించిన మేకమాంసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మాంసం మెత్తగా ఉడికి, కూర దగ్గర పడుతుండగా దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే కాశ్మీరీ ఘోస్ట్ తయారైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పరోటా, దోసెలతోపాటు తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి