చికెన్ సాటె ఎలా తయారు చేస్తారు?

గురువారం, 17 ఏప్రియల్ 2014 (17:27 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్ బ్రెస్ట్‌లు... రెండు
లెమన్ గ్రాస్... ఒక టీస్పూన్
కొత్తిమీర తరుగు... రెండు టీస్పూన్లు
పచ్చిమిరప తరుగు... ఒక టీస్పూన్
చింతపండు గుజ్జు... ఒక టీస్పూన్
ధనియాలపొడి... అర టీస్పూన్
నువ్వుల నూనె... అర టీస్పూన్
రిఫైండ్ ఆయిల్... ఒక టీస్పూన్
కొబ్బరిపాలు... సరిపడ
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చికెన్ బ్రెస్ట్ ముక్కలకు లెమన్ గ్రాస్, కొత్తిమీర తరుగు, పచ్చిమిరప తరుగు, చింతపండు గుజ్జు, ధనియాలపొడి, నువ్వుల నూనె, రిఫైండ్ ఆయిల్, కొబ్బరిపాలు, తగినంత ఉప్పు కలిపి ఒక గంటసేపు మారినేడ్ (అన్నింటినీ బాగా కలిపి ఉంచడం) చేసుకోవాలి.

తరువాత చికెన్ బ్రెస్ట్ ముక్కలను రెండు అంగుళాల పొడవుగా కోసుకోవాలి. వీటిని పుల్లలకు గుచ్చి గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ అందుబాటులో లేనట్లయితే... బొగ్గులపై కాల్చి, తందూరీలాగా చేసుకోవచ్చు. గ్రిల్ చేసుకున్న వాటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చి తీసేయాలి... అంతే చికెన్ సాటె రెడీ అయినట్లే..! వీటిని పీనట్ సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి