మసాలా దినుసుల సువాసన సంరక్షణకు...

సోమవారం, 21 అక్టోబరు 2013 (14:25 IST)
File
FILE
మసాలా దినుసులు వంటకాలను ఘుమఘుమలాడిస్తాయి. ఇవి నోరూరించే ఘాటుతో పాటు రుచినీ అందిస్తాయి. ఇలాంటి మసాలా దినుసులను జాగ్రత్తగా భద్రపరిస్తే వాటి రంగు, రుచి, సువాసన చెడిపోకుండా సుదీర్ఘకాలం నిల్వ ఉంచుకోవచ్చు.

ముఖ్యంగా.. కాంతి, వేడి, తేమ వంటివి తగిలినట్టయితే, వాటి సువాసన పోతుంది. అందువల్ల చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవడం మంచిది. ఓవెన్, ఫ్రిజ్, స్టవ్, ఇతర విద్యుత్ దీపాల వెలుగులకు దూరంగా ఉంచాలి.

ఎందుకంటే.. వీటి నుంచి వెలువడే ఆవిరి, వేడి మసాలా దినుసులు చెడిపోయేలా చేసేందుకు ఆస్కారం ఉంది. ఈ మసాలా దినుసులను విడివిడిగా సీసాల్లో భద్రపరిచి, గట్టిగా మూత బిగించి ఉంచుకుంటే... ఎన్నాళ్ళయినా బాగా ఘుమఘుమలాడుతూ ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి