మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో మీకు తెలుసా?

FILE
మహిళలకు మష్రూమ్ ఎంతో మేలు చేస్తుంది. గర్భసంచికి ఎంతో మేలు చేసే మష్రూమ్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఐరన్, క్యాల్షియం, తక్కువ కెలోరీలను డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కూడా తీసుకోవచ్చు. అలాంటి మష్రూమ్‌తో పిల్లలకు నచ్చేలా ఫ్రై ఎలా చేయాలో ట్రై చేద్దామా..

కావలసిన పదార్థాలు :
మష్రూమ్ - రెండు కప్పులు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత

తయారీ విధానం :
ముందుగా మష్రూమ్‌ను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన బెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేపాలి. తర్వాత మష్రూమ్స్ కూడా చేర్చి నీరు పోయకుండా నూనెలోనే బాగా వేపుకోవాలి. తగినంత ఉప్పు, కారం కలుపుకుని మష్రూమ్‌లోని నీరు ఇంకేంత వరకు వేపుకుని దించేయాలి. అంతే మష్రూమ్ ఫ్రై రెడీ. దీనిని వేడి వేడి అన్నానికి సైడిష్‌గా సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు.

వెబ్దునియా పై చదవండి