"పాలక్ వడలు" ఎలా తయారు చేస్తారు?

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (17:12 IST)
File
FILE
పాలకూర పప్పు, పాలకూర పులుసు, పాలకూర పచ్చడి... ఇవన్నీ అందరూ వండేవే. కానీ కాస్తంత కొత్తగా, మరింత వెరైటీగా ఉండేలా పాలకూరతో ఏదైనా చేయాలని ప్రయత్నించేవారు ఈ "పాలకూర" వడలను ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు :
గోధుమపిండి.. ఒక కప్పు
పెరుగు.. ఒక కప్పు
పాలకూర.. రెండు కట్టలు
అల్లం.. చిన్న ముక్క
పచ్చిమిర్చితరుగు.. ఆరింటిది
ఉప్పు.. రుచికి సరిపడా
నూనె.. పావుకేజీ
జీలకర్ర.. ఒక టీస్పూన్

తయారీ విధానం :
అల్లం చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర జోడించి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను గోధుమపిండికి కలిపి పెరుగు జోడించాలి. తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి ఆకులను సన్నగా తరిగి ఈ పిండిలో వేయాలి.

పది నిమిషాలు అలాగే పిండిని నానబెట్టిన తరువాత బాణలిలో నూనెపోసి మరిగించాలి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లాగా వత్తి మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి పాలక్ వడలు సిద్ధమైనట్లే..! వీటని వేరుశెనగ లేదా కొబ్బరి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి