వరి బీజం ఆపరేషన్ జరిగింది.. అంగం మధ్యలో మెత్తబడి పోతోంది... ఎందుకని?

బుధవారం, 6 మార్చి 2013 (15:46 IST)
File
FILE
చాలా మంది పురుషులు వరి బీజంతో బాధపడుతుంటారు. ఈ సమస్యకు వయస్సుతో నిమిత్తం లేదు. కొంతమందికి వయస్సు మీద పడిన తర్వాత ఈ సమస్య వస్తే.. మరికొందరికి చిన్న వయస్సులోనే వస్తుంది. అయితే, నాలుగు పదులు దాటిన పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చూసేందుకు మరీ పెద్దదిగా ఉంటే ఆపరేషన్ చేయించుకుంటారు. తర్వాత కొన్నేళ్ళ పాటు బాగానే ఉంటుంది.

కాలం గడిచే కొద్దీ అంగం మధ్యలోనే మెత్తబడి పోవడం, అంగ స్తంభనలు కలగకపోవడం జరుగుతాయి. దీంతో భార్య వద్దే కాకుండా ఇతర మహిళలతో సెక్స్‌లో పాల్గొన్నపుడు కూడా హేళనను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వారు లోలోన కుమిలి పోతుంటారు. వరి బీజం ఆపరేషన్ తర్వాత లైంగిక కోర్కెలు తగ్గిపోతాయా.. అంగం మధ్యలో మెత్తబడి పోవడం జరుగుతుందా అనే సందేహంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే...

వరి బీజానికి ఆపరేషన్ తర్వాత మళ్ళీ నీరు చేరే అవకాశం ఉండదు. అంగస్తంభనం నిద్రలో, కొన్నిసార్లు భార్య దగ్గర బాగానే ఉంటాయి. అయితే, వరిబీజం ఆపరేషన్ తర్వాత మానసికంగా ఆందోళనకు గురై ఉంటారు. అలాగే, భార్య లేదా పరాయి స్త్రీలు హేళన చేస్తూ తిరస్కరించడం తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఈ సమస్యను మరింత పెద్దది చేస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారు భార్యతో సహా కౌన్సెలింగ్‌కి వెళ్లడం, సెక్స్ థెరఫీకి సెక్సాలజిస్ట్‌ను కలిసి సమస్యను పరిష్కరించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి