ప్రతిరోజూ మూడు స్పూన్ల తేనెను.. గ్లాసుడు నీళ్లలో కలుపుకుని తాగితే?

సోమవారం, 18 మార్చి 2013 (16:16 IST)
FILE
తేనెలో 70 రకాల విటమిన్లు ఉంటాయట. అలాగే తేనెలో ఏడు రకాలు ఉన్నాయట. కానీ తేనెలో ఎన్ని రకాలున్నా.. కొండ ప్రాంతాలకు చెందిన వృక్షాల్లో గల తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తేనెలోని గ్లూకోజ్ అలసటను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను క్రమం చేస్తుంది. తద్వారా గుండెపోటు వంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు. కంటి జబ్బులు, చర్మ వ్యాధులకు తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది.

అల్లం, సీడ్ లెస్ ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. ఒకే గ్లాసు వేడినీరు లేదా వేడి చేసిన పాలలో మూడు స్పూన్ల తేనె కలుపుకుని రాత్రి తాగితే నిద్రలేమి దూరం అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతీరోజూ వంద గ్రాముల తేనె కలిపిన జ్యూస్ తీసుకుంటే రక్త బలహీనతకు చెక్ పెట్టవచ్చు.

వరుసగా ఆరు వారాల పాటు తేనె తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అధికమవుతుంది. ఇంకా మీ చర్మం సౌందర్యవంతంగా తయారవుతుంది. రోజూ మూడు స్పూన్ల తేనెను వంద మి.లీటర్ల వేడినీరుతో మార్నింగ్ లేదా రాత్రి పూట తీసుకుంటే ఉదర సంబంధిత వ్యాధులు, అలర్జీ, పిత్త సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.

వెబ్దునియా పై చదవండి