ప్రసవం తరువాత రెండో బిడ్డకోసం ఎంత విరామం అవసరం...?

సోమవారం, 26 ఆగస్టు 2013 (13:58 IST)
FILE
ప్రసవం తర్వాత శారీరక తీరు సక్రమంగా ఉండేందుకు, బిడ్డ పెంపకం కోసం కూడా బిడ్డకు బిడ్డకు నడుమ విరామం అవసరం. ప్రసవం తర్వాత, బిడ్డకు పాలిచ్చే సమయంలో హిమోగ్లోబిన్, క్యాల్షియం స్థాయిలు పెంచుకోవడానికి చాలినంత వ్యవధి కావాలి. బిడ్డ సంరక్షణ కోసం కొంత సమయాన్ని తప్పక కేటాయించాల్సి ఉంటుంది.

బిడ్డ పెంపకంలో, కొత్త బాధ్యతలు, పనుల దృష్ట్యా కొంత శారీరక అలసటఉంటుంది. కాబట్టి వెంటనే గర్భం దాల్చడం వల్ల సరైన శారీరక, మానసిక విశ్రాంతిని పొందలేకపోతారు. కనుక బిడ్డకూ బిడ్డకు కనీసం మూడేళ్ళు వ్యవధి అవసరం. అయితే తల్లి వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి.

తొలిబిడ్డ జన్మించే నాటికి వయస్సు ముప్పైలోపే ఉంటే మరో బిడ్డకు నిరభ్యంతరంగా మూడు నుంచి నాలుగేళ్ళ వ్యవధి తీసుకోవాలి. మొదటి ప్రసవానికే మూడు పదులు దాటితే, వ్యవధిని కొంత తగ్గించుకోవలసి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి