వారానికి 50 గంటలు మాత్రమే పనిచేయాలట? లేదంటే?

FILE
వారానికి కేవలం 50 గంటలు మాత్రమే పనిచేసే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుందట. అలా కాకుండా ఎక్కువ గంటలపాటు పనిచేసేవారు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు చెందిన ఓ యూనివర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

మనిషి వారానికి యాభై గంటలు మించి పనిచేస్తే వారికి శారీరక, మానసిక పరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. ఇలా మానసిక, శారీరక పరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే వారి మధ్య ప్రాథమిక సంబంధాలను గుర్తించారు.

సోనియా బ్రిట్‌, జేమీ బ్లూలతో కలిసి యూనివర్సిటీలోని పరిశోధక విద్యార్ధి సారా అసెబెడో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో మరో ధ్యాస లేకుండా పనిమీదే దృష్టి సారించే వారంటే వారు వారానికి యాభై గంటలకన్నా ఎక్కువ పనిచేసేవారని అర్ధమని, ఇలాంటివారు ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా శక్తిని కోల్పోతారని అసెబెడో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి