నడుము నొప్పి ఉపశమనానికి కొన్ని జాగ్రత్తలు!

మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (16:22 IST)
File
FILE
చాలా మంది స్త్రీపురుషులు నముడు నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ నొప్పిని నివారించవచ్చని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు. అవేంటో ఇక్కడ పరిశీలిద్ధాం.

వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాల్ని ముందుకు కుంచించడం కాకుండా పొడవుగా శరీరం కిందకు జరపాలి. కడుపు భాగం లోపలికి జరగాలి. శరీరం భారీకాయంగా ఉండి ఎక్కువ బరువు ఉంటే వెన్ను మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. అందుకని ఆహార నియమాల్ని పాటిస్తూ శరీరానికి తగ్గ బరువును కలిగి ఉండాలి. ఆహారంలో కొవ్వు తక్కువ, కేలరీలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

కుక్కి మంచాల మీద కాకుండా గట్టిగా ఉండే మంచాలపై పడకోవాలి. మంచం మీద పడుకోబోయే ముందు, లేచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఉదుటున కాకుండా నిదానంగా లేవడం, నిదానంగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. తల కింద దిళ్లు మరీ ఎత్తుగా ఉండకుండా చూసుకోవాలి.

నడిచేటప్పుడు రిలాక్స్‌గా ఉండాలి. గూనీ పెట్టకుండా, భుజాలను కిందికి జరిపి ఎత్తుగా నడవాలి. పొట్ట లోపలికి ఉండాలి. బరువు ఎత్తేటప్పుడు నడుము వంచకూడదు. మోకాళ్లను కూడా... బరువు ఎత్తేటప్పుడు పక్కకు తిరగకూడదు. అంతేకాకుండా సుమారుగా 90 శాతం నడుము నొప్పులను వ్యాయామంతో తగ్గించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి