మాంసాహారంతో హృద్రోగ సమస్యలు!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:19 IST)
FILE
మాంసాహారం ఎక్కువుగా తీసుకోవడం వల్ల గుండెబబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ మాంసాహారంలో వుండే ఇనుప ధాతువు (హిమీ ఐరన్) వల్ల హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం వుందని బ్లూమింగ్టన్‌లోని ఇండియానా విశ్వవిద్యాలయ ప్రజారోగ్య కళాశాల పరిశోధకులు చెబుతున్నారు.

వీరు తాజాగా హిమీ ఐరన్‌కు, హృద్రోగాలకు ఉన్న సంబంధంపై పరిశోధనలు జరిపారు. మాంసాహారం ద్వారా శరీరానికి అందే ఇనుప ధాతువు వల్ల గుండెజబ్బులు అధికంగా వచ్చే అవకాశముంది. అదే సమయంలో శాకాహారం ద్వారా అందే ఇనుప ధాతువు (నాన్ హిమీ ఐరన్) వల్ల హృద్రోగాల ముప్పేమీ ఉండదన్నారు.

గొడ్డుమాంసం, చేపలు, పక్షి మాంసాల్లో ఈ హిమీ ఐరన్ అధికంగా ఉంటుంది. శాకాహార ఇనుప ధాతువు కంటే మాంసాహారంలోని ఇనుప ధాతువును శరీరం దాదాపు ఏడురెట్లు వేగంగా శోషణం చేసుకుంటుంది. అయితే శోషణం తరువాత ఇది ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ఆక్సీకరణంలో ఉత్ప్రేరకంగా పనిచేసి కణజాల క్షీణతకు కారణమయ్యే ప్రమాదముంది. దానివల్ల హృద్రోగ ముప్పు అధికమవుతుందని పరిశోధకులు తేల్చారు.

వెబ్దునియా పై చదవండి