మొండి జలుబును వదిలించుకోవడమెలా...?

మంగళవారం, 4 మార్చి 2014 (13:31 IST)
FILE
జలుబుగా ఉన్నప్పుడు తరచుగా తుమ్ములు వస్తుంటాయి. వీటిని వదిలించుకునేందుకు నాలుగు గులాబీ పూల రేకులు తీసుకుని ఒక అరగంట నువ్వుల నూనెలో వేసి కొద్దిసేపు వేడి చేశాక, తర్వాత వడపోసి రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే తరచుగా వచ్చే తుమ్ములు తగ్గిపోతాయి.

మిరియాలు మూడు ఒక చెంచా తేనెలో మెత్తగా నూరి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే చిరకాలంగా ఉన్న జలుబు తగ్గుతుంది.

జలుబు వచ్చినప్పుడు ముక్కు దిబ్బడ పడుతుంది. ఇలాంటి సమయాల్లో చాలామంది ఇన్హేలర్స్ వాడుతుంటారు. వీటికి బదులుగా నల్ల జీలకర్ర చూర్ణాన్ని గుడ్డలో మూట కట్టి వాసన చూస్తుంటే జలుబుతో ముక్కు దిబ్బడకు స్వాంతన లభిస్తుంది.

దానిమ్మ పువ్వుల రసాన్ని అయిదారు చుక్కలు ముక్కులో వేసుకుంటే ముక్కు నుంచి వచ్చే స్రావం ఆగిపోతుంది. జలుబుతో తలనొప్పి కూడా వస్తుంటే ఏలకుల చూర్ణము ముక్కులో పీలుస్తూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది.

తరచూ జలుబుతో బాధపడేవారు పాతబియ్యం, పెసలు, ఉలవల చారు, ముల్లంగి, వెల్లుల్లి, వేడినీళ్లు, తేలిక ఆహారం తీసుకోవడం మంచిది.

అలాగే చన్నీళ్ల స్నానం, కోపం తెచ్చుకోవడం, నేలపై పడుకోవడం, ఎక్కువసార్లు తెల్లటి ద్రవపదార్థాలను తీసుకోవడం జలుబు ఉన్నవారు చేయకూడదు.

వెబ్దునియా పై చదవండి