కాకరకాయ రసంతో చక్కెర వ్యాధికి చెక్!

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (16:23 IST)
File
FILE
ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. కాకర రసం చేదుగానే ఉంటుంది. కాకర కాయను తినడానికే కాసింత చక్కెర వేసి మరీ తింటుంటారు. అందునా కాకర రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. మధుమేహానికి మందుగా కాకర రసం సూచించడం వరకు బాగానే ఉంటుంది. కాని అతి కష్టంగా త్రాగినా కూడా అది మళ్లీ బైటికి వచ్చేస్తుంది.

ఈ రసం పడని వారికి వాంతులైతే మరికొందరికి విరేచనాలు అవుతాయి. అందువల్ల కాకరకాయ రసం కొద్దికొద్దిగా తాగాల్సి ఉంటుంది. ఏకబిగిన గ్లాసెడు కాకర రసం త్రాగితే అది జీర్ణం కాక బయటికి వచ్చేస్తుంది. కాబట్టి తొలుత ఒకటి-రెండు చెంచాల రసంతోనే మొదలు పెట్టండి.

ఆ తర్వాత క్రమంగా మోతాదును పెంచుకుంటూ ఇతర మందులు లేకుండా కాకర రసాన్ని త్రాగడమే మేలని మధుమేహంతో బాధపడేవారు అనుకుంటారు. దీంతో మధుమేహం మీకు బై చెప్పేసి పారిపోతుంది అంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి