మూత్ర విసర్జన సమయంలో యోనిలో మంట, దురద... చిట్కాలు

గురువారం, 28 నవంబరు 2013 (16:00 IST)
FILE
మహిళల్లో చాలామంది లైంగిక అవయవాలకు సంబంధించిన అనారోగ్యాన్ని చెప్పరు. వైద్యం చేయించుకునేందుకు సైతం సిగ్గుపడుతుంటారు. కానీ మూత్ర విసర్జన సమయంలో యోనిలో మంట, దురద వంటి సమస్యలతో ఎక్కువ మంది సమస్య ముదిరాక వస్తుంటారని వైద్యులు చెపుతున్నారు. ఈ సమస్యకు మూల కారణం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. యోని, మూత్రాశయం లోనికి హానికర బ్యాక్టీరియా చేరడంతో సమస్య తలెత్తుతుంది.

ఎలా ఉంటుంది...?
మూత్ర విసర్జన సమయంలో యోనిలో మంట పుడుతుంది. మూత్రం వచ్చినట్లే ఉంటుంది. కానీ మూత్రానికి వెళితే రాదు. మూత్రాశయ ద్వారం వద్ద దురద లేదా మంట పుడుతుంది. సమస్య మరీ తీవ్రతరం అయితో మూత్ర విసర్జన సమయంలో రక్తం కూడా పడుతుంది.

సమస్యను ఎదుర్కోవడమెలా...?
పైన పేర్కొన్న మూత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు క్రాన్ బెర్రీ జ్యూస్ ను రోజుకు రెండు గ్లాసులు తాగితే ఫలితం ఉంటుంది. మూత్రాశయ గోడలపై ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ఈ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది.

మరో మార్గం విటమిన్ సి ఉన్న పదార్థాలు, లేదా మాత్రలను తీసుకోవడం. ఎందుకంటే విటమిన్ సి తీసుకోవడం వల్ల మూత్రంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. అది యూరినర్ ట్రాక్ సిస్టమ్ ను క్రమబద్ధీకరించడమే కాక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది.

ఇక ఇలాంటి సమస్యను ఎదుర్కొనేందుకు సెక్స్ భంగిమలను కూడా మార్చుకోవాలి. రోజూ చేసే సెక్స్ భంగిమలకు బదులు కొత్త భంగిమల్లో రతిలో పాల్గొనాలి. అంతేకాదు... సమస్య తీవ్రతను బట్టి యాంటిబయోటిక్ మందులను కూడా వాడాల్సి ఉంటుంది.

సెక్సులో పాల్గొన్న తర్వాత సెక్స్ అంగాలను నీటితో శుభ్రం చేసుకోవడం ఖచ్చితంగా పాటించాలి. కేవలం సెక్సులో పాల్గొన్న తర్వాతే కాదు... పాల్గొనే ముందు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సంభోగం ద్వారా మూత్రాశయంలోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం తక్కువగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి