అసలు స్మోకింగ్ ఎంత డేంజరెస్సో తెలుసా...?

శనివారం, 30 నవంబరు 2013 (20:31 IST)
WD
స్మోకింగ్ ఫ్యాషన్ అని ఒకరంటే... ఒత్తిడిని దూరం చేసే ఆయుధం అని మరొకరంటారు. ఐతే అంతకంటే అది ప్రాణాన్ని తీసే యమపాశం అనే సంగతి మాత్రం చాలామందికి తెలిసినా మర్చిపోయి ఊదేస్తుంటారు. పొగాకు ఉత్పత్తులు శరీరంలో ఆయా అంగాలకు చేసే హాని ఏంటో ఒక్కసారి చూద్దాం.

WD
స్మోకింగ్ వల్ల శరీరంలో ప్రతి అవయవంలో సమస్య తలెత్తుతుంది. పొగతాగడం వల్ల కేన్సర్, దీర్ఘకాలికంగా ఇబ్బందిపెట్టే సమస్యలు వదలకుండా వస్తాయి. తల భాగానికి వస్తే తల లేదా గొంతులో కేన్సర్ రావచ్చు. కళ్ల విషయానికి వస్తే అంధత్వం వచ్చే అవకాశం.

WD
బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకర జబ్బుకు ఇదే కారణం కావచ్చు. నోరు చెడిపోతుంది. ఊపిరితిత్తులు సమస్యలు, లంగ్ కేన్సర్ రావచ్చు. గుండెపోటు రావచ్చు. కడుపులో నొప్పితోపాటు న్యూమోనియా కూడా తలెత్తవచ్చు. కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.

WD
కాలేయ సంబంధిత జబ్బులకు అవకాశం. మూత్ర నాళాల్లో ఇబ్బంది తలెత్తవచ్చు. స్త్రీలు, పురుషుల్లోనూ సంతానలేమి సమస్య ఎదుర్కొనవచ్చు. ఇలా శరీరాన్ని పొగ ఉత్పత్తులు నానా హింస పెడతాయి. అందువల్ల పొగతాగడాన్ని మానుకోవడం ఆరోగ్యానికి ఎంతైనా శ్రేయస్కరం.

వెబ్దునియా పై చదవండి