తులసి రొమ్ము కేన్సర్‌ను నివారిస్తుంది....

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (16:41 IST)
WD
తులసి మొక్కకు ఎంతో పవిత్రత, ఘనత ఉన్న సంగతి తెలిసిందే. తులసిలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అజీర్ణం, తలనొప్పికి విరుగుడుగా తులసి ఆకులు వేసి టీ తయారుచేసి పెద్దలు ఇవ్వడాన్ని మనం చూస్తుంటాం. ఈ తులసికి దగ్గు, చర్మవ్యాధులు, ప్రేవులకు సంబంధించిన రుగ్మతలను బాగా నయం చేసే శక్తి ఉన్నది.

అంతేకాదు స్త్రీలలో రొమ్ము కేన్సరును నివారించగలదు. కణితులను తగ్గించడంలో, వాటిలో రక్తసరఫరా తగ్గించడంలో, అవి విస్తరించకుండా నిరోధించడంలో తులసి కీలక పాత్ర వహిస్తుంది. తులసి తైలనాన్ని శరీరానికి మంచి వర్చస్సు, తేజస్సును ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి