ఏవండోయ్... కంప్యూటర్‌తోనే మీ ఉద్యోగమా...?!! కాస్త ఇవి పాటిద్దురూ...!

బుధవారం, 21 ఆగస్టు 2013 (14:43 IST)
WD
కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చుంటున్నారా...! ఐతే ఈ చిట్కాలు పాటిస్తే భవిష్యత్తులో మీకు తలెత్తబోయే ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు.
1. మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సేపు పని చేస్తున్నట్లైతే, కంప్యూటర్ నుంచి 2. దాదాపు 30 సెంటీమీటర్ల దూరంలో కూర్చోని పనిచేయండి.
3. ఒకవేళ కంప్యూటర్ యొక్క మానిటర్ బ్లింక్ అవుతుంటే దాంతో పని చేయడం మానివేయండి.
4. ప్రతి రెండు-మూడు గంటలకొకసారి కాసేపు నడవడం అలవాటు చేసుకోండి.
5. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి మీ దృష్టిని కాసేపు మరల్చండి, 15-20సార్లు కనురెప్పలను మూసి తెరవండి లేదా కాసేపు అలా కళ్ళను మూసి ఉంచండి. ఆ తర్వాత మీ తలను మీ సీటుకు ఆన్చి రిలాక్స్ అవ్వండి.
6. మీ మెడను మెల్లగా ఒత్తండి. అలాగే కుడి-ఎడమవైపుకు తిప్పండి.
7. క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయండి.
8. వీలైనంత ఎక్కువ సేపు నిద్రపొండి.

వెబ్దునియా పై చదవండి