మజ్జిగలో చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటే..?

FILE
ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని చేస్తుంది. భోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

ఇకపోతే.. ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు, కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ఆయా కాలాలను బట్టి ఏ రకం అందుబాటులో ఉంటే వాటిని వాడాలి. తాజాగా సేకరించటం సాధ్యంకానట్లయితే ఇవన్నీ విడివిడిగా పౌడర్లు దొరుకుతాయి. వాటిని రోజూ ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి.

ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపు చేస్తాయి. వాటిని చేరకుండా నిరోధిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని, చర్మం మీద ముడతలు వంటి వార్ధక్య లక్షణాలను నివారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి