ఎలాంటి ఆహారం తినకూడదో తెలుసా...?

మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (15:19 IST)
FILE
చాలామంది ఎలాబడితే అలా ఆహారాన్ని లాగించేస్తుంటారు. కానీ ఆహారం తినడానికి ముందు మనం తింటున్న ఆహారం ఎలాంటిదో తెలుసుకోవాలి. కొన్ని పాయింట్లు....

ఒకసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్లీ దానిని వేడిచేసి ఎట్టి పరిస్థితుల్లో తినరాదు.
ఒకరు తినగా వదిలేసిన ఆహారం తినకూడదు.
మాడిపోయినటువంటి లేదా నిలువ వుంచి, పైన ఉప్పు తేలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోండి.
తేనె తాగిన తర్వాత వెంటనే నిమ్మరసం తాగకూడదు.
తేనె, నెయ్యి సమపాళ్లలో కలిసి తీసుకోరాదు.
తేనెను చాలామంది తాగుతుంటారు. ఐతే దానిని చల్లటి నీళ్లలో కలుపుకుని తాగకూడదు.
బచ్చలి కూర నువ్వుల నూనెలో వండి తినరాదు.
ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకూడదు.

వెబ్దునియా పై చదవండి