మీ చేతివేళ్లు మీరెంత తెలివిగలవారో చెపుతాయట....

శనివారం, 19 ఏప్రియల్ 2014 (20:30 IST)
FILE
చేతివేళ్ల సైజును బట్టి పిల్లల మేధావితనం చెప్పేయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏడేళ్ల వయస్సులో పిల్లల చూపుడు, ఉంగరపు వేళ్ల పొడవు లెక్కలు, చదువులో నైపుణ్యాన్ని తెలియజేస్తాయని లండన్ శాస్త్రవేత్తల పరిశోధనలు పేర్కొన్నాయి.

చూపుడువేలు ఉంగరం వేలికంటే చిన్నదిగా ఉన్న మగపిల్లలు చాలా తెలివైనవారుగా ఉంటారని, అలాగే చూపుడు, ఉంగరం వేళ్లు సమంగా ఉండే ఆడపిల్లలు తెలివైనవారవుతారని పరిశోధనలు వివరించాయి. ఉదరంలో ఉండే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల విభిన్నస్థాయిలు ఇందుకు కారణమవుతాయని, వాటి ప్రభావం మెదడు ఎదుగుదల, వేలి పొడవులు రెండింటిపై ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి