6 నెలల తర్వాత మీ శిశువుకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు?

FILE
శిశువు జన్మించిన ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఆరు నెలల తర్వాత ఇచ్చే ఆహారంలో మెలకువలు అవసరమని వారు చెబుతున్నారు. ఈ ప్రాయంలో ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని మెల్ల మెల్లగా అలవాటు చేయాలి. ఉదయం 8-9 గంటల్లోపు ఉదయం అల్పాహారం ఇవ్వాలి. అల్పాహారం ఇచ్చిన రెండు గంటల తర్వాత పాలు ఇవ్వొచ్చు.

నూనె వస్తువులు కాకుండా ఇడ్లీ వంటి బేకింగ్ వంటలను ఇవ్వడం చాలామంచిది. ఇంకా పప్పుల్ని ఉడికించిన నీరు, రసం, పులుపెక్కని పెరుగు ఆహారంలో చేర్చుకోవచ్చు. కేవలం తియ్యటి పదార్థాలే పిల్లలకు పెట్టి అలవాటు పడకుండా, కారం, ఉప్పును కూడా చేర్చాలి.

ఉదయం 11-12 గంటల ప్రాంతంలో ఉడికించిన ఆపిల్ ఇవ్వడం చేయాలి. ఇంకా ద్రాక్ష, దానిమ్మ పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను ఇవ్వడం మంచిది. ప్రతీసారి పిల్లలకు అప్పుడే వండిన ఆహారాన్ని ఇవ్వడం మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి