బేబీకి మసాజ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏమిటి?

గురువారం, 16 జనవరి 2014 (17:41 IST)
FILE
మీ శిశువుకు ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని చైల్డ్‌కేర్ నిపుణులు అంటున్నారు. బేబీకి సున్నితంగా ఆలివ్ ఆయిల్ లేదా వైద్యుల సలహా మేరకు మసాజ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగవుతుంది.

బేబీ మసాజ్ వల్ల పిల్లల్లో మలబద్ధకాన్ని నివారిస్తుంది. తరచూ ఏడుస్తుండే పిల్లలకు మసాజ్ మంచి విశ్రాంతినిస్తుంది. శిశువు పెరుగుదలకు మసాజ్ ఎంతగానో ఉపకరిస్తుంది.

అలాగే పిల్లలను సున్నితంగా ఎత్తుకోవాలి. ఇలా చేస్తే మీ బేబీ మీ స్పర్శను ఎంజాయ్ చేస్తారు. ఇది వారు సౌకర్యవంతంగా నిద్రించడానికి సహాయపడుతుంది.

బేబీ మాసాజ్ కొరకు శిశువును ఎత్తుకోవడం మెరుగుపరుచుకోవాలి. మీ స్పర్శ శిశువుకు చెప్పలేనన్ని మాటల్లో మీకు ఎక్స్ ప్రెస్ చేస్తుంది.

మీరు సున్నితంగా శిశువును తాకడం లేదా ఎత్తుకోవడం వల్ల మీ శిశువు సురక్షితంగా మరియు సెక్యూర్‌‌గా ఫీలవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి