మొదటి ఆటంబాంబు ఎప్పుడు పేలింది?

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (10:00 IST)
అంతంత మాత్రంగా ఉన్న యాంత్రీకరణ 20వ శతాబ్దంలో బాగా అభివృద్ధి చెందింది. ఆయుధబలాన్ని పెంచుకునే దిశగా అన్ని దేశాలూ అడుగులు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధట్యాంకులు, యుద్ధవిమానాలు, కనుగొన్నారు. మిలటరీ మెరైన్ టెక్నాలజీ అభివృద్ధి జరిగింది.

రెండవ ప్రపంచయుద్ధ సమయానికి జర్మనీ పెద్దఎత్తున సాయుధ దళాలను సమకూర్చుకుంటే అమెరికా ఆటమ్‌బాంబు కనిపెట్టింది. దీనిని మొదటిసారిగా 1945వ సంవత్సరం జులైలో న్యూమెక్సికోలో ప్రయోగాత్మకంగా పేల్చింది. ఆ తర్వాత రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించింది. ఈ బాంబుపేలుడులో దాదాపు లక్షాముప్ఫైఐదువేల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా.

వెబ్దునియా పై చదవండి