అమెరికాలో ప్రారంభమైన లోక్‌సత్తా సురాజ్యం

మంగళవారం, 21 ఆగస్టు 2012 (13:41 IST)
PR
న్యూయార్క్ నగరంలో భారత్‌లోని లోక్‌సత్తా ఉద్యమాన్ని తమ దేశంలో ప్రతిధ్వనించేలా "పీపుల్ ఫర్ లోక్ సత్తా" మరియు "ఇండియా అగెనెస్ట్ కరప్షన్"కు సంబంధిచిన షుమారు 40 మంది వాలంటీర్లు లోక్‌సత్తాకై భారత్ ౩2వ పెరేడ్‌లో పాల్గొని భారత్‌లో స్వఛ్చమైన రాజకీయాలు రావాలని నినాదాలు చేశారు.

వీరంతా పీ.ఫ్‌.యల్ టీ-షర్ట్‌లు ధరించి "సురాజ్యం" అనే బ్యానర్లతో మాడిసన్ అవెన్యులోని 38వ వీధి నుండి 23వ వీధి వరకు "వందేమాతరం", "జై హింద్" ,"పీపుల్ ఫర్ లోక్ సత్తా", "జై కిసాన్", "జై జవాన్" అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.

వీరి నినాదాలతో ఆ ప్రాంతాలలోని భారతీయులు సైతం భారత్‌పై ఉన్న ప్రేమానురాగాలతో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా గొంతు కలిపి భారతదేశ పేరును అమెరికా వీధులంతా ప్రతిధ్వనింపజేశారు. పెరేడ్‌లో భారత జాతీయ గీతాలాపనలో తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.

వరుసగా ఈ పెరేడ్‌‌ను నిర్వహించడం ఇది మూడోసారని భారత్‍‌కు మద్దతుగా స్వఛ్చమైన రాజకీయాలతో భారత అభివృద్దికై యన్.ఆర్.ఐలు ఈ ఉద్యమంలో పాల్గొంన్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ రణబోతు, శ్రీనివాస్ కరుటూరి, సురేష్ తదితర సభ్యులు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి