లోక్‌సత్తా పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఎన్.ఆర్.ఐలు సిద్ధం

శనివారం, 15 సెప్టెంబరు 2012 (20:40 IST)
WD
లోక్‌సత్తా పార్టీ సంస్థాగత ఎన్నికలలో పాల్గొనేందుకు లోక్‌సత్తా ఎన్నారై మద్దతుదారులు నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ ఫర్ లోక్‌‌సత్తా (పిఎఫ్ఎల్) పేరుతో ఎటువంటి రాజకీయ లాభం ఆశించని అమెరికా పార్టీ సంస్థగా పీపుల్ ఫర్ లోక్‌‌సత్తా సంస్థాగత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ప్రోత్సహించడానికి ఓ ప్రపంచ కాన్ఫరెన్స్ సదస్సును నిర్వహించింది.

ఈ సదస్సులో అమెరికా బే ఏరియాకు చెందిన ప్రసన్నా మేడా, లోక్‌సత్తా పార్టీ నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా ఎన్.ఆర్.ఐలకు ఓటు హక్కును కల్పించిన ప్రప్రధమ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌సత్తా పార్టీ సభ్యత్వానికున్న ప్రయోజనాలు హౌస్టన్‌కు చెందిన రాఘవ సోలిపురం వివరించారు.

2014లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సత్తా పార్టీ విజయకేతనం ఎగురవేసేందుకు లోక్‌సత్తా పార్టీ సంస్థాగత ఎన్నికలను ప్రారంభించాలని నిర్ణయించారు. అమెరికాలోని బే ఏరియా, చికాగో, హౌస్టన్, న్యూజెర్సీ, వాషింగ్టన్ మరియు ఇతర ప్రదేశాల నుంచి 2000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొని పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోగా అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్ష మందిని నమోదు చేయడం లక్ష్యమని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ కోసం కృషి చేస్తున్న ఎన్ఆర్ఐలు హైమా సాగీ, దిలీప్ శంకర రెడ్డీ, పద్మ భూపతిరాజు భారతదేశానికి తిరిగి వచ్చారు.

లోక్‌సత్తా పార్టీలో అత్యధికంగా ప్రజలను సభ్యత్వం తీసుకునేలా ప్రజలలో చైతన్యం తీసుకు రావాలని లోక్‌‌సత్త పార్టీ అధ్యక్ష్యుడు జయప్రకాష్ నారాయణ్ గారికి ఎన్ఆర్ఐ మేడా ప్రసన్న తెలియజేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి పార్టీలు కుటుంబ నేపధ్యాలతో వారి వారి తరాలే నాయకులుగా దేశాన్ని పాలిస్తుండగా లోక్‌సత్తా పార్టీ నిస్వార్ధపూరిత రాజకీయాలతో యువతకు చోటు కల్పిస్తూ నిజమైన ప్రజాస్వామ్యా పార్టీగా వ్యవహరిస్తుందన్నారు.

ఇప్పటికే అమెరికాలోని ఎన్ఆర్ఐలను తమ పార్టీ సభ్యత్వంతో పిఎఫ్ఎల్ అన్న పేరుతో ఒక టీమ్‌ను స్థాపించగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలను సభ్యత్వం తీసుకోవాలని కోరారు. లోక్‌‌సత్తా పార్టీ సభ్యత్వం కేవల 20 డాలర్ల ఖర్చుతో మూడు సంవత్సరాల పాటు పొందవచ్చని కేవలం ఒక నిమిషం సమయం కేటాయించి "మెంబర్స్ డాట్ లోక్‌సత్తా డాట్ ఆర్గ్" అనే లింకు ద్వారా సభ్యత్వం పొందవచ్చని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నిస్వార్ధ రాజకీయాలతో భవిష్యత్ తరాలకు మెరుగైన మార్గాన్ని ఏర్పరిచేందుకు లోక్‌‌సత్తా పార్టీ సేవలందిస్తుందని వారు వివరించారు.

వెబ్దునియా పై చదవండి