చెలీ నీవైనా దరిచేరవా... నాకోసం!

బుధవారం, 29 ఆగస్టు 2007 (19:59 IST)
యిమ్మడిశెట్టి వెంకటేశ్వర్రావ్
PTI PhotoPTI
గత కాల గమనంలోని
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని స్వప్నం

దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు

నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...
నాకోసం...