మీకు మంచి స్నేహితుడు లభించాడా? అతడినే లవర్‌గా?

శనివారం, 25 జనవరి 2014 (17:36 IST)
FILE
మీ స్నేహితుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలనుందా.. అయితే చెడు స్నేహితులను ఎలా కనుగొనాలో తెలియట్లేదా..? అయితే ఈ కథనం చదవండి. మీకు లభించిన స్నేహితుడు మంచివాడైతే.. ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాడు. మీ ఆత్మగౌరవం మెరుగుపడడానికి సహాయపడుతారు.

చెడు స్నేహితులైతే లేనిపోని సమస్యలను వారి సృష్టిస్తారని మానసిక వైద్యులు అంటున్నారు. మంచి స్నేహితుడినే లవర్‌గా మార్చుకోవాలనుకునేటప్పుడు అతడి గుణగణాలను బేరీజు వేసుకోవాలి. చెడు స్నేహితుడైతే మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తారు.

స్నేహితులు ప్రేమాభిమానాలను పంచుకోవాలే కానీ ఎల్లప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నా లేదా మీ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నా అది మీకు చెడును తలపెట్టే చెడు స్నేహితులుగా భావించాలి. మీ స్నేహితులు నిరంతరం ఒక నియంతలాగా ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే అటువంటి సందర్భంలో చెడు స్నేహితుడితో స్నేహం కలిగి ఉండటంలో అర్ధం లేదు .

మీ స్నేహితులు ప్రతి పరిస్థితిలోనూ కోపం తెప్పించడానికి ప్రయత్నించడం మీరు అసౌకర్యాన్ని కలిగి ఉన్నారని తెలిసి కూడా అందరి ముందు మిమ్మల్ని తక్కువగా, తప్పుగా కనిపించేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఆ స్నేహితుడిని వదిలించుకోవడం ఉత్తమం.

వెబ్దునియా పై చదవండి