మహిళల గృహ హింస ఆసియా దేశాల్లోనే అధికం: ముగ్గురిలో ఒకరు?

FILE
మహిళలపై హింసలు, అత్యాచారాలు, దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పురుషునికి సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ మహిళలకు భద్రత కరువైంది. ఎక్కడ చూసిన అత్యాచారాలు, గృహ హింసలు, వేధింపులు అధికమైపోతున్నాయి.

ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరిస్తోంది. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింస బాధితులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసపై నిర్వహించిన అధ్యయనానికి సంబంధించిన వివరాలకెళితే.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ముఫ్ఫై శాతం మంది మహిళలు తమ భర్తల చేతుల్లో హింసకు గురవుతున్నారని తేలింది.

ఈ హింస ఆసియా, మధ్య తూర్పు దేశాల్లో మరింత ఎక్కువగా ఉంది. అలాగే మహిళల హత్యల విషయంలోనూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 38 శాతం భర్తలు చేసినవేనని ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి