మహిళలూ విశ్రాంతికి ఎంత సమయం కేటాయిస్తున్నారు?

FILE
మహిళలూ.. విశ్రాంతికి ఎంత సమయం కేటాయిస్తున్నారు..? పనులకు కేటాయించే సమయానికంటే హడావుడిలో ఆహారం, విశ్రాంతికి మహిళలు కేటాయించే సమయం చాలా తక్కువ. పనులకు కేటాయించి విశ్రాంతి గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వలన శరీరం పగటి పూట పూర్తిగా పని చేయటం, రాత్రి పూర్తిగా నిద్రించటం అనే ట్రెండ్‌ సాగుతుంది. ఇది పూర్తిగా సరికాదు.

ఎందుచేతనంటే పనిలో మెరుగైన ఫలితాలు రావాలన్నా, క్వాలిటీ పరంగా బెస్టుగా ఉండాలన్నా కొద్ది పాటి విరామం అవసరం. వీలుంటే మధ్యాహ్నం లంచ్‌ తర్వాత కొద్ది సేపు కనులు మూసుకొని విశ్రాంతి తీసుకోవటం ఒక పరిష్కారం. లేదంటే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలి. దీని వలన ఆ తర్వాత నుంచి రాత్రి వరకు పనులన్నీ చకచకా సాగుతాయి.

ఇలా కాకుండా కంటిన్యూగా పనిచేసుకొంటూ వెళితే మెదడు, ఇతర ముఖ్య అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి అంటే గాఢమైన నిద్ర అవసరం లేదు. కాస్తంత కనులు మూసుకొని రిలాక్సు అయినా సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి