గాజులు ఎందుకు ధరిస్తారు?

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (17:18 IST)
FILE
గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు, రంగు గాజులను ధరించి ఫ్యాషనబుల్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తాం. అలాగే చేతినిండా బంగారు గాజులు ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం. అయితే గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా?

గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి.

దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం లేదా అంటే.. ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకొవచ్చు. అలాగని మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు. కాబట్టి ఒకరకంగా అలంకరణకు గాను, ఆరోగ్య సాధనంగాను ఉపకరించే విధంగా డిజైన్ అయినవే ఈ గాజులు.

వెబ్దునియా పై చదవండి