ముఖారవిందానికి తగినట్టుగా బొట్లు పెట్టుకోవాలి!!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (17:57 IST)
File
FILE
మహిళలను చూసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించేది నుదుటి మీద వుండే సింధూరమే. ఆడవారి ముఖం అందంగా ఆకర్షణగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకునే కాటుక, నుదుటి మీద వుండే తిలకం బొట్టు. ముఖం ఆకృతిని బట్టి ఎవరు ఏవిధమైన బొట్టు పెట్టుకుంటే అందంగా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ముఖానికి తగ్గట్టు సింధూరం పెట్టుకుంటే ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది. శరీరం రంగు, ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి.

నుదురు చిన్నగా వుంటే కొంచెం పొడవుగా వుండే బొట్టు, ఆటీన్ ఆకారంలో వుంటే బొట్టు పెట్టుకోవాలి. నుదురు వెడల్పుగా వుంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది.
నుదురు పెద్దగా వుండేవారు బొట్టును కనుబొమల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా వుంటుంది.

తెల్లని శరీరఛాయ గలిగిన వారికి ముదురురంగు బొట్టు ఆకర్షణీయంగా వుంటుంది. చామనఛాయ లేదా అంతకన్న కాస్త రంగు తక్కువగా వున్నవారైతే పింక్, ఆరంజ్, గంధపురంగు, లేత గులాబి రంగు, ఎరుపు రంగు బొట్టు కళగా వుంటుంది.

వెబ్దునియా పై చదవండి