వక్షోజాలు అందంగా మలచుకునేందుకు ఏ చేయాలి?

గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:30 IST)
FILE
శృంగార పరంగా మహిళల్లో ఎక్కువ ఆకర్షణీయమైన శరీరంలో మొదటి స్థానం వక్షోజాలకే దక్కుతుంది. వక్షోజాల తర్వాతే ముఖ, శరీరాకృతి, రంగు ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటుంటారు. నిండైన హృదయ అందాలు ఉన్న స్త్రీలలో సెక్సప్పీల్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే సినిమా స్టార్స్, మోడల్స్ ఇతర విషయాలతో పాటు శరీర సౌష్టవం, ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.

అయితే, వక్షోజాల పరిమాణం ఒక్కో స్త్రీలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వక్షోజాల ఆకృతిని, పరిమాణాన్ని మార్చుకునేందుకు ఎన్నో చికిత్సలు నేడు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రకాల ఇంజెక్షన్లు వక్షోజాల సైజును పెంచేందుకు వాడుతుంటారు. వీటివల్ల కొంతమేరకు ఉపయోగం ఉన్నప్పటికీ మున్ముందు దుష్ఫలితాలు లేకపోలేదని కొంతమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

వక్షోజాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంజక్షన్లు, మందులు కాకుండా మరికొన్ని మార్గాలున్నాయి. అవి ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ వంటివి. దీనివల్ల పరిమాణంలో మార్పు కనిపిస్తుంది. ఇదంతా ఖరీదైన వ్యవహారం. అందరికీ అందుబాటులో ఉండదు. ఖరీదుకు వెరవకుండా ఉంటే అపుడా విధానాలు అనుసరించవచ్చు.

ఇవికాకుండా.. సహజ పద్దతుల్లో కూడా ఈ సైజులను పెంచుకోవచ్చు. అంటే... పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న నెయ్యి, నూనెలు వాడటం వల్ల వక్షోజాల సైజును పెంచుకోవచ్చని చెపుతున్నారు. దీనివల్ల శరీరంలో అదనంగా చేరే కొవ్వు వల్ల వక్షోజాల పరిమాణం కొద్దిగా మారే అవకాశం ఉందట.

అదేసమయంలో వక్షోజాలు చిన్నవిగా ఉండడానికి హార్మోన్ల లోపమే కారణమంటున్నారు. ఇటువంటి వారు హార్మోన్ల చికిత్స చేయించుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. మొదటి నుంచి వక్షోజాలు పెరగని వారికి కూడా ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుందని వైద్యులు చెపుతున్నారు. వక్షోజాల ఎదుగుదలలో లోపం, సరైన వయస్సుకు రజస్వల కాకపోవడం, అండాలు సరిగా విడుదల కాకపోవటం ఇటువంటి వాటిలో కొన్నివున్నాయి.

అలాగే, వ్యాయామం వల్ల చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవచ్చు కానీ వక్షోజాల ఆకృతి మార్చడం, పెద్దవి చేయడం కుదరదు. స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే వక్షోజాల ఆకృతి అన్ని వయస్సులో ఒకే విధంగా ఉండదు. వయస్సును బట్టి, ఇతర కారణాలను బట్టి మారుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

వక్షోజాలు చిన్నవిగా ఉన్నంత మాత్రాన నిరాశలో కూరుకుపోయి, ఆకర్షణలేదనుకోవడం ఎక్కువగా టీనేజ్ యువతులలో కనబడుతుంది. ఆత్మవిశ్వాసమే అసలైన ఆకర్షణ అని గ్రహిస్తే ఇటువంటి యువతులు పడే మానసికవేదన తగ్గడమే కాదు, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నఇటువంటి వారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షించవచ్చని మానసిక వైద్యులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి