వేసవిలో మృదువైన పాదాల కోసం స్మాల్ టిప్స్

శనివారం, 19 ఏప్రియల్ 2014 (15:59 IST)
FILE
వేసవిలో పాదాలు మృదువుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. ఒక బకెట్‌లో గోరువెచ్చని వేడినీటిని తీసుకోవాలి. ఈ నీటిలో పది ఎం.ఎల్ డెటాల్, ఇరవై ఎం.ఎల్ షాంపు వేసి బాగా కలపాలి.

ఈ నీటిలో పది నిమిషాల పాటు మీ పాదాలను ఉంచాలి. తర్వాత పాదాలను బాగా బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయాలి. ఆ తర్వాత పాదాలను తేలికపాటి కాటన్ తో తుడుచుకుని మసాజ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజ్ క్రీమ్ రాసి పాదాలకు బాగా మర్దన చేయాలి.

ఐదు నిమిషాల తర్వాత క్రీమ్‌ను కాటన్‌తో క్లీన్ చేసి పౌడర్‌ను పాదాలకు అప్లై చేసుకుంటే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.

వెబ్దునియా పై చదవండి