మహిళలూ.. చీరల్ని ఎలా ఎంచుకుంటున్నారు?

మహిళలు శారీలంటే తెగ ఇష్టపడతారు. సంప్రదాయ చీరలు మగువల అందానికి వన్నె తెస్తాయి. అయితే శరీరాకృతిని బట్టి చీరలు ఎంచుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు.

సన్నగా ఉండే మహిళలు బిగుతైన వస్త్రాలను ధరించకూడదు. జాకెట్టును కూడ కాస్త వదులుగా ఉండేలా ఎంచుకోవాలి. లావుగా ఉన్న మహిళలు శారీ, జాకెట్టులను కాస్త బిగుతుగా ధరించడం ద్వారా సన్నగా కనిపిస్తారు.

లావుగా ఉండే మహిళలు చీరలు, జాకెట్టు లేత రంగులను ఎంచుకోవాలి. ఒకే రంగులో చీరాజాకెట్టు ఎంచుకోవడం కంటే మీ అందానికి వన్నె తెచ్చేలా చీరలను సెలక్ట్ చేసుకోవాలి. షాపింగ్‌లకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పూతలు గల, లేత రంగు చీరలను కట్టడం, అవీ నైలాన్‌ శారీలను ధరించడం మేలు.

ఆలయాలకు, బీచ్‌లకు వెళ్లేటప్పుడు ముదురు రంగు, కాటన్ చీరలు అందాన్నిస్తాయి. ఎత్తుగా ఉన్న మహిళలు, అడ్డు గీతలు గల చీరల్ని ధరించవచ్చు. పొట్టిగా ఉన్న వారు నిలువు గీతలు గల చీరలను ఎంచుకోవాలి. శారీలు కట్టేటప్పుడు బార్డర్, బీట్స్ శరీరాకృతికి తగ్గట్టు సెలక్ట్ చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి