మహిళలూ హై హీల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

FILE
మహిళలూ హై హీల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారని ఆరోగ్య నిపుణులు. పొట్టిగా ఉండడం వల్లనో, లేదా ఫ్యాషన్‌గా భావించడం వల్లనో, లేక మరేదైనా కారణాల వల్లనో హైహీల్స్‌ వేసుకోవడానికి మహిళలు ఇష్టపడుతుంటారు.

ఇలాంటి వాళ్లకు మోకాలి కీళ్లు అరిగిపోయే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చైనాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఎత్తు మడమల చెప్పులను ధరించిన వారికి మోకాలి కీలులో అరుగుదల కనిపించినట్టు తేలింది.

హైహీల్స్‌ చెప్పులు ధరించిన వారిలో మోకాలి కీలులో అరుగుదల కనిపించినట్టు పరిశోధకులు గుర్తించారు. హైహీల్స్‌ ఉన్న చెప్పులు, షూలు వేసుకుని రోజూ బస్సు ఎక్కడానికో లేదా ఏదో ఒక విషయానికి పరుగులెత్తాల్సి వస్తుంది.

అయితే హైహీల్స్‌ వేసుకుని పరుగులెత్తడం వల్ల దీర్ఘకాలంలో దాని ప్రభావం మోకాలి కీలుపై ఎక్కువగా ఉంటుందని, హైహీల్స్‌ వల్ల మోకాలిపై ఎక్కువ భారం పడుతుందని, దీని ఫలితంగా కీలు అరుగుదల వేగవంతం అవుతుందని, మడమల్లో కూడా ఇది తీవ్రమైన నొప్పికి కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి