వైఎంసీఎలో పోచంపల్లి ఆర్ట్ మేళా.... సందడి చేసిన నటి అలేఖ్య

గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:59 IST)
WD
అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నిపుణులైన నేత కార్మికులు ప్రత్యేక ఇకత్ ఆర్ట్ మేళా -2014 హైదరాబాదులోని నారాయణగూడలోని వైఎంసీఎ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటి, ఆ ఐదుగురు మూవీ ఫేమ్ అలేఖ్య ప్రారంభించారు. ఈ తరహా ప్రదర్శనల వల్ల చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం ఉందని నటి అలేఖ్య చెప్పారు.

హ్యాండ్ లూమ్ పార్క్ చైర్మన్ దేవేందర్, సీఈఒ దామోదర్, మాజీ చైర్మన్ కృష్ణలు మాట్లాడుతూ... ఈ నెల 21వ తేదీ వరకూ కొనసాగే ప్రదర్శనలో ప్రాచీన భారతీయ సంప్రదాయంలో ఉన్న హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులను విభిన్న రకాల్లో అందుబాటులో ఉంచామని వివరించారు. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, హోమ్ ఫర్నిషింగ్స్ వంటి వందలాది రకాల ఉత్పత్తులను ప్రస్తుత ట్రెండ్ కు అనుకూలంగా చక్కటి కలర్స్, షేడ్స్ లో అందస్తున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి