గృహాలంకరణలో ఫర్నీచర్ పాత్ర ఎంత?

మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (16:36 IST)
File
FILE
సాధారణంగా ఇంట్లోని సోఫా కుషన్‌ల కింద దుమ్ము బాగా పట్టివుంటుంది. కాబట్టి, నెలలో ఒకటి రెండు సార్లయినా వీటిని తీసేసి మృదువైన బ్రష్‌తో శుభ్రం చేయాలి. అదెలాగంటే... ఒక కప్పు ఆలివ్‌ ఆయిల్‌, ఒక కప్పు నిమ్మరసం కలిపి ఉడెన్‌ ఫర్నిచర్‌ని గుడ్డతో నెమ్మదిగా తుడిచినట్లయితే నీట్‌గా కనిపిస్తాయి.

సాధ్యమైనంతగా... ఆయా గదుల్లో కలపతో చేసిన ఫర్నీచర్‌ ఎక్కువగా అలంకరించినప్పటికీ.. ఇల్లు నిర్మాణంలో మాత్రం కలప అతి తక్కువగా వాడటం మంచిది. ఎందుకంటే, ఏవేని అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు మరింతగా పెరిగేందుకు కలప తోడ్పడుతుంది కాబట్టి, గృహ నిర్మాణంలో స్టీల్‌నే ఎక్కువగా వాడటం శ్రేయస్కరం.

ఇకపోతే... ప్రతి ఇంట్లో ఫ్యాన్‌లు, ఏసీలు ఉన్నప్పటికీ స్వచ్ఛమైన గాలి అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. కాబట్టి.. ఇళ్లలోనే మొక్కలను పెంచుకునేందుకు కొంత ప్రదేశం కేటాయించి, వీలైనన్ని మొక్కలను పెంచుకోవటం మంచిది. సాధ్యమైతే ప్రతి గుమ్మానికీ అటూ, ఇటూ నీడలో పెరగగలిగే మొక్కలను పెంచడం వల్ల... వాటిని పదే పదే చూస్తుంటే కళ్లకు హాయిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి